ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
x
Highlights

ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసిగుడ్డు బలైపోయింది. అమ్మ కడుపులోంచి బయటకు రాకుండానే మృతి చెందింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బయట...

ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసిగుడ్డు బలైపోయింది. అమ్మ కడుపులోంచి బయటకు రాకుండానే మృతి చెందింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బయట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళకు నర్సు ఆపరేషన్ చేసింది. వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ సమయంలో కత్తెరతో శిశువు తలపై గాయం అయ్యింది. తీవ్రంగా బ్లీడింగ్ అయి చిన్నారి మృతి చెందింది. దీంతో గర్భిణి బంధువులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories