Nizamabad: నకిలీ చాలానాతో మద్యం పక్కదారి

Nizamabad: నకిలీ చాలానాతో మద్యం పక్కదారి
x

Nizamabad: నకిలీ చాలానాతో మద్యం పక్కదారి 

Highlights

Nizamabad: నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కొత్తరకం కుంభ కోణం వెలుగు చూసింది. అధికారులు- మద్యం వ్యాపారులు చేతులు కలిపి సర్కారు ఖజానాకు గండి కొట్టిన వైనం...

Nizamabad: నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కొత్తరకం కుంభ కోణం వెలుగు చూసింది. అధికారులు- మద్యం వ్యాపారులు చేతులు కలిపి సర్కారు ఖజానాకు గండి కొట్టిన వైనం ఆలస్యంగా బయటపడింది. విక్రయాలు లేని బార్ల నుంచి గిరాకీ ఉన్న వైన్స్ లకు అక్రమంగా మద్యం తరలిస్తూ ప్రివిలేజ్ ఫీజుకు గండి కొడుతున్నారు. ఈ వ్యవహారంలో ఓ బార్ తో పాటు వైన్స్ ను సీజ్ చేశారు. మరోవైపు నకిలీ చాలాన్ స్కామ్ లో అధికారుల పాత్రలేదని ఉన్నతాధికారులు అంటున్నారు.

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ లోని లిక్కర్ డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని 18 బార్లు, 128 మద్యం దుకాణాలకు మద్యం సరఫరా అవుతోంది. బార్లు, వైన్స్ యజమానులు చెల్లించిన చాలానా మేరకు మద్యం సరఫరా చేస్తారు. మాదాపూర్ లిక్కర్ డిపోలో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ డూప్లికేట్ చాలాన్ తో ఓ బారుకు 6 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని సరఫరా చేశాడు. కామారెడ్డిలోని అతిథి బార్ చాలాన్ సమర్పించినట్లు రికార్డుల్లో నమోదు చేశాడు. నెలవారి ఆడిట్ లో ఈ అక్రమం బయటపడింది.

నకిలీ చాలన్ వ్యవహారం వెలుగుచూడగానే హైదరాబాద్ నుంచి అబ్కారీ అధికారులు మాదాపూర్ డిపోలో లిక్కర్ స్టాక్ ను తనిఖీలు చేశారు. ఫేక్ చాలానుతో మద్యం అక్రమంగా సరఫరా చేసినట్లు గుర్తించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బోగస్ చాలాన్ వ్యవహారంపై విచారణ చేస్తున్న సమయంలో మరో అక్రమం వెలుగు చూసింది. కామారెడ్డి అతిథి బార్ పేరిట కోనుగోలు చేసిన మద్యాన్ని నిజామాబాద్ శివారులోని సాయి గంగా వైన్స్ లో విక్రయించినట్లు బయటపడింది. 14 శాతం ప్రివిలేజ్ ఫీజు రూపంలో సర్కారు జమ చేయాల్సిన ఆదాయానికి గండి కొట్టినట్లు అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. బార్ తో పాటు వైన్స్ ను సీజ్ చేసి ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బార్లకు కేటాయించిన లక్ష్యం మేర విక్రయాలు జరగడం లేదని వ్యాపారులు తేలివితేటలు ప్రదర్శించారు. గిరాకి లేని బార్ల నుంచి విక్రయాలు ఎక్కువగా ఉండే వైన్సు లకు మద్యాన్ని తరలిస్తున్నారు. మూడు నెలలుగా అక్రమ మద్యం బదిలీ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు కోటి రూపాయల కుంభకోణం జరిగినట్లు భావిస్తున్నారు. నకిలీ చాలాన్ కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ ను సస్పెండ్ చేసి కేసు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర లేదని ఉన్నతాధికారులు కొట్టి పారేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిపోలో వెలుగుచూసిన బాగోతంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా అక్రమాలపై అబ్కారీ శాఖ దృష్టి సారించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories