అప్పు తీర్చలేక బాలిక అప్పగింత

అప్పు తీర్చలేక బాలిక అప్పగింత
x
Highlights

ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక అత్యాచారయత్నానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో...

ఖమ్మం జిల్లాలోని పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక అత్యాచారయత్నానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగా ఈ కేసులో బాలిక తల్లిదండ్రులు ఓ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన వివరాల్లోకెళితే మృతురాలి తల్లిదండ్రులు పల్లెగూడెంలోని ఓ వ్యక్తి వద్ద కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. అయితే వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తీసుకున్న అప్పును తీర్చలేక పోయారు. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో వారి కన్న కూతురిని ఖమ్మం ముస్తఫానగర్‌లోని ఓ ఇంట్లో అలాగే అప్పు ఇచ్చిన వ్యక్తి అల్లం సుబ్బారావు ఇంట్లో పనిమనిషిగా కుదిర్చాడు.

అయితే కొంత మంది మాత్రం అప్పు తీర్చలేని క్రమంలోనే ఆ వ్యక్తి బలవంతంగా బాలికను ఇంట్లో బందించి పని చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలికను ఆ ఇంటి యజమాని కుమారుడి చేతిలో అత్యాచారయత్నానికి, ఆపై హత్యాయత్నానికి గురై మృతిచెందింది. కాగా తమ కూతురు మృతి చెందడానికి తమకు అప్పు ఇచ్చిన వ్యక్తి అల్లం సుబ్బారావు కూడా కారణమేనని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డిని మాట్లాడుతూ ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories