పది రోజుల్లో హాస్టల్ విద్యార్థులకు కొత్త డైట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

New Diet For Welfare School Students
x

పది రోజుల్లో హాస్టల్ విద్యార్థులకు కొత్త డైట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Highlights

Welfare School Students: ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకోసం డైట్, కాస్మొటిక్ ఛార్జిలను పెంచినందుకు మంత్రులు, ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Welfare School Students: ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకోసం డైట్, కాస్మొటిక్ ఛార్జిలను పెంచినందుకు మంత్రులు, ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి సీతక్క, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, సంజయ్ భేటీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల హాస్టల్ డైట్, కాస్మిటిక్ ఛార్జిలు పెంచారని కృత్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పది రోజుల్లో విద్యార్థులకు కొత్త డైట్‌ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు స్పష్టంచేశారు. పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థుల‌కు చేకూరనున్న ప్రయోజనం పొందనున్నారని సీఎం తెలిపారు.

డైట్‌ఛార్జీలు పెంచుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యారంగ స‌‌మస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. సంక్షేమ‌‌ హాస్టల్, గురుకుల స్టూడెంట్లకు డైట్, కాస్మోటిక్ చార్జీలు 40 శాతం పెంచామని చెప్పారు. ‘‘ఇదే విద్యార్థులకు అసలైన దీపావళి. బీఆర్ఎస్ హయాంలో ఏడేండ్లుగా డైట్ చార్జీలు ,16 ఏండ్లుగా కాస్మోటిక్ చార్జీలు పెర‌‌గ‌‌లేద‌‌ు. ఇప్పుడు కాంగ్రెస్​ సర్కారే పెంచింది. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పెరిగిన ధరలకు తగ్గట్టుగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎంకు ధన్యవాదాలు. ఇక నుంచి హాస్టల్ విద్యార్థులు అర్ధాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదు. పెరిగిన డైట్ చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిపై ఉంది. చార్జీలు గ్రీన్ చానల్ ద్వారా చెల్లిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories