తెలుగురాష్ట్రాల్లో స్ట్రెయిన్ కలకలం..

తెలుగురాష్ట్రాల్లో స్ట్రెయిన్ కలకలం..
x
Highlights

కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెట్టిస్తోంది. యాంటీబాడీస్ నుంచి తప్పించుకుంటూ జన్యుపరివర్తనం చెందే లక్షణం ఉండడంతో కొత్త స్ట్రెయిన్...

కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెట్టిస్తోంది. యాంటీబాడీస్ నుంచి తప్పించుకుంటూ జన్యుపరివర్తనం చెందే లక్షణం ఉండడంతో కొత్త స్ట్రెయిన్ మరింత ఆందోళన కలిగిస్తోంది. యూకే నుంచి తెలంగాణకు 12వందల 16 మంది వచ్చారు. వీరిని గుర్తించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారు ఎవరెవరిని కలిశారో అందరినీ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటికే 20మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐతే వీరికి సోకింది పాత వైరసా కొత్తదా అని తేల్చేందుకు సీసీఎంబీ కొత్త జీన్ సిద్ధం చేసింది. దీనికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపించింది.

ఇక యూకే నుంచి ఏపీకి ౧౩౬౩ మంది రాగా ఇప్పటివరు 1346 మందిని గుర్తించారు అధికారులు. వారిలో 1324 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. 11మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా వారి రిపోర్టులను ఎన్ఐవీ పుణె, సీసీఎంబీకి పించారు. యూకే నుంచి తిరిగి వచ్చిన వాళ్లంతా కలిపి 5వేల 784 మందిని కలిసినట్లు గుర్తించిన అధికారులు వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories