New Corona Variant: జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా వేరియంట్ కలకలం

Corona virus in Telangana
x

కరోనా వైరస్ (పతీకాత్మక చిత్రం)

Highlights

New Corona Variant: ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న న్యూ వేరియంట్

New Corona Variant: జగిత్యాల జిల్లాలో కరోనా వేరియంట్ భయపెడుతోంది. ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల వరుసగా కరోనా స్ట్రైయిన్ కేసులు బయటపడుతుంటడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నవారికి కరోనా స్ట్రేయిన్ బయటపడుతుండటంతో గ్రామాల్లో నిఘా పెట్టింది వైద్యశాఖ. జిల్లాలో ఇప్పటికే నాలుగు బ్రిటన్ స్ట్రైయిన్ కేసులు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు.

జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త స్ట్రెయిన్‌ కలకలం రేపుతోంది. దుబాయి నుంచి స్వగ్రామాలకు వస్తున్నవారికి ...వారి ద్వారా కుటుంబ సభ్యులకు కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగిత్యాలకు.. దుబాయి నుంచి బ్రిటన్‌ విమానాల్లో వచ్చిన నలుగురు వ్యక్తులకు కొత్త స్ట్రయిన్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం.

జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి టౌన్, కోరుట్ల మండలంలోని వెంకటాపూర్‌, మల్యాల మండలంలోని ముత్యంపేట, కథలాపూర్‌ మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులకు యూకే వేరియంట్‌ సోకినట్లు అధికారులకు సమాచారం అందింది. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన 26 సంవత్సరాల వ్యక్తి బ్రిటన్‌ విమానంలో గత నెల 25న దుబాయి నుంచి స్వస్థలానికి వచ్చాడు. ఇటీవల కరోనా వైద్య పరీక్షలు నిర్వహిం చుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇక మెట్‌పల్లి పట్టణానికి చెందిన 28 సంవత్సరాల ఓ యువకుడు ఈ నెల 1న దుబాయి నుంచి బ్రిటన్‌ విమానంలో స్వగ్రామానికి వచ్చాడు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అతని నమూనాలు సేకరించిన వైద్యులు అతని కూడా పాజిటీవ్ గా నిర్దారించారు.

ఈ నలుగురు బ్రిటన్ విమానంలో గల్ష్ దేశాల నుండి ఇండియాకి చేరుకున్నారు...వీరికి ఆ విమానంలోనే కరోనా వేరియింట్ సోకి ఉంటుందని అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఇండియాలో దిగిన తరువాత విమానాశ్రయంలోనే వీరి శాంపిల్స్ తీసుకుని వైద్యశాఖ టెస్టులు నిర్వహించింది. అయితే ఫలితాలు వచ్చేంత వరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని సూచించినా కూడా గ్రామాల్లో కలియతిరగడంతో పాటు...కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. దీంతో వారిలో కూడా కొంత మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గల్ష్ నుండి వచ్చి పాజిటివ్ వచ్చిన వారితో పాటుగా...అనుమానితులుగా ఉన్న వారిని కూడా హైదరబాద్ తలరిలించింది వైద్యశాఖ.

గల్ష్ దేశాల నుండి వచ్చిన ఓ వ్యక్తి పాజిటీవ్ వచ్చాక తనకి చెందిన 14 మంది కుటుంబ సభ్యులకు సైతం అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి స్ట్రయిన్‌ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించారు. వీరి ఫలితాలు వచ్చే రెండు, మూడు రోజుల్లో రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories