New 108 Services in Telangana: తెలంగాణాలోనూ కొత్త 108లు.. వంద కొనుగోలు చేసిన ప్రభుత్వం

New 108 Services in Telangana: తెలంగాణాలోనూ కొత్త 108లు.. వంద కొనుగోలు చేసిన ప్రభుత్వం
x
108 services
Highlights

New 108 Services in Telangana: కరోనా తీవ్ర రూపం దాల్చడంతో దానికి ఎదుర్కొనే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి.

New 108 Services in Telangana: కరోనా తీవ్ర రూపం దాల్చడంతో దానికి ఎదుర్కొనే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. మెరుగైన వైద్యంతో పాటు వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో సుమారుగా 1,050 108, 104 వాహనాలను కొనుగోలు చేసి, విధులను గాను మండల కేంద్రాలకు పంపారు. అదే రీతిలో తెలంగాణా ప్రభుత్వం సైతం ఇప్పటివరకు ఉన్న వాహనాలతో పాటు మరో వంద వాహనాలను అదనంగా కొనుగోలు చేసి,విధుల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుం డటం, అనేక కేసులు సీరియస్‌గా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం '108'అత్యవసర అంబులెన్స్‌ సేవలను మరింత విస్తరించింది. కొత్తగా మరో వంద వాహనాలను కొనుగోలు చేసింది. అవి నేడో రేపో రాష్ట్రానికి చేరుకోనున్నాయి. ప్రస్తుతము న్న వాహనాల్లో 90 అంబులెన్సులు కరోనా బాధితుల నిమిత్తం వినియోగిస్తుండగా మిగిలిన వాటిని ఇతర అత్యవసర సేవలకు వాడుతున్నారు. దీంతో అంబులెన్సుల కొరత ఏర్పడి కొన్నిచోట్ల సాధారణమైన వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. వా టిల్లో ఎలాంటి ఆక్సిజన్‌ సదుపాయాలు కూడా ఉం డటంలేదు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద టెం డర్లు పిలిచి వంద కొత్త '108'అంబులెన్స్‌ వాహనా లు కొనుగోలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

క్రిటికల్‌ కేర్‌ ఏర్పాట్లు

కొత్తగా వచ్చే వంద '108'అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ సదుపాయం ఉంటుంది. కరోనా కేసులు సీరియస్‌ అయినప్పుడు అవసరమైన అత్యాధునిక వసతుల తో వీటిని తయారు చేయించినట్లు వైద్య, ఆరోగ్యశా ఖ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల క్రిటికల్‌ కేర్‌ ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. కేసులు అత్యధికంగా నమోదవుతున్న హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, ఈ కొత్త అంబులెన్సులకు అవసరమైన డ్రైవర్లను, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories