అన్నం పెట్టిన ఇంటికే కన్నం

అన్నం పెట్టిన ఇంటికే కన్నం
x
Highlights

ఒకప్పుడు దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి వీధుల్లో గూర్కాలను ఏర్పాటు చేసుకునేవారు. ఆ గూర్కాలు నేపాల్ వాళ్లయితే నిర్భయంగా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు...

ఒకప్పుడు దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి వీధుల్లో గూర్కాలను ఏర్పాటు చేసుకునేవారు. ఆ గూర్కాలు నేపాల్ వాళ్లయితే నిర్భయంగా నిద్రపోయేవారు. కానీ ఇప్పుడు నేపాల్ పనిమనుషులంటేనే నగరవాసులు హడలెత్తిపోతున్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టే స్థాయికి ఎదిగిపోయారు. నేపాలి అంటేనే భయపడిపోయేలా చేస్తున్నారు. ఇంతకీ వారు ఏం దర్మార్గం చేస్తున్నారు. నేపాలి పని మనుషులు పోలీసులకు ఎందుకు టార్గెట్ అయ్యారు.

నగరంలో నేపాల్ పనిమనుషులు హల్ చల్ చేస్తున్నారు. పని కల్పించండి మహాప్రభు అంటూ నగరంలోని పెద్ద పెద్ద ఇండ్లల్లో వాలిపోతారు. నేపాలి అంటే నమ్మాలి అన్నంత రేంజ్ లో నమ్మకంగా పనిచేస్తారు. ఇంటి యజమానుల కదలికలన్నింటిని గమనిస్తారు. అదును చూసి అందిన కాడికి దోచుకుంటారు. టార్గెట్ ఫినిష్ అయ్యాక నేపాల్ కు చెక్కేస్తారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదు. నగరంలో ఇలాంటి కేసులు నగరంలో రోజురోజుకు పెరుగుతున్నాయి.

రెండు నెలల క్రితం హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఘటన మరవక ముందే తాజాగా మరో ఘటన పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. రాయదుర్గం పోలీస్టేషన్ పరధిలోని బీఎన్ ఆర్ హిల్స్ లో బోర్ వెల్ కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ కి చెందిన నలుగురు వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి భోజనంలో మత్తు పదార్ధాలు కలిపి ఇంట్లో ఉన్న 15లక్షల నగదు, 5తులాల బంగారం దోచుకొని హుడాయించారు. ఎలాంటి ఆధారం దొరకకుండా సీసీటీవీ కెమెకా డీవీఆర్ ను, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు.

ఉదయం తేరుకున్న బాధిత కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు మాదాపూర్ ఇన్ చార్జి డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టుల వద్ద నిఘా పెంచారు. బాధితుల సెల్ ఫోన్లను శివారు ప్రాంతంలో పడేసినట్లు సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు పారిపోతుండగా స్థానికంగా పనిచేసే ఓ వాచ్ మెన్ చూసినట్లు వివరించాడు.

గతంలో మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలోని వ్యాపారి నర్సింహా రెడ్డి ఇంట్లోనూ ఇలాంటి ఘటన చేటుచేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 2కోట్ల విలువైన బంగారం, వజ్రాలను దొంగిలించారు. దొంగల కోసం రాచకొండ పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ నేపాల్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఠాసభ్యులంతా ఒకేచోట ఉండరు. ఒక్కో నగరంలో ధనికుల ఇండ్లల్లో పనికి చేరుతారు. ఎక్కడ చోరీ చేసేందుకు అనుకూలంగా ఉంటుందో పసిగడతారు. చివరకు టార్గెట్ నిర్ణయించుకున్నాకా అందరూ అక్కడికి చేరుకుని సొత్తుతో ఉడాయిస్తారు.

టార్గెట్ సక్సెస్ అయ్యాకా దొంగిలించిన సొత్తును పంచేసుకొని సొంతూళ్లకు పయనమవుతారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దొంగల ఇండ్లు నేపాల్ లో ఎత్తైన కొండపై ఉంటాయి. అక్కడికి చేరుకోవాలంటే కనీసం 5 గంటల నుంచి 7 గంటల వరకు కాలిబాటన నడవాల్సిందే పోలీసుల రాకపోకల్ని దొంగలు ఈజీగా గుర్తుపట్టి తప్పించుకుంటారు. అయితే సైనిక్ పురి కేసులో నిందితుల ఆధారంగా రాయదుర్గం కేసును చేధించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories