ఆరు నెలల తరువాత ప్రారంభమైన జూ పార్క్...

ఆరు నెలల తరువాత ప్రారంభమైన జూ పార్క్...
x
Highlights

హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌ గేట్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా మార్చిలో మూతపడిన జూ పార్క్‌ ఆరునెలల తర్వాత పున:ప్రారంభమయ్యింది. అన్‌లాక్‌ 5.0లో...

హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌ గేట్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా మార్చిలో మూతపడిన జూ పార్క్‌ ఆరునెలల తర్వాత పున:ప్రారంభమయ్యింది. అన్‌లాక్‌ 5.0లో భాగంగా సందర్శకులను అనుమతిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నెహ్రు జూలాజికల్‌ పార్క్. 1963 అక్టోబర్‌ 6న ఈపార్క్‌ను ప్రారంభించారు. దాదాపు 300 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న పార్కు ఎంతో మంది సందర్శకులు ఆకర్షిస్తోంది. ఇక లాక్‌డౌన్‌‌ ప్రభావంతో మూతపడిన పార్క్‌ అన్‌లాక్ 5.0లో భాగంగా పున:ప్రారంభమైంది.

కోవిడ్‌ ప్రత్యేక నిబంధనలతో జూ ప్రార్క్‌లోకి సందర్శకులను అనుమతిస్తున్నారు అధికారులు. టికెట్‌ కౌంటర్‌ దగ్గర భౌతిక దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా లోపలికి వెళ్లే ముందు సందర్శకులు విధిగా నీటితో కాళ్లను, చేతులు శ్రుభం చేసుకుంటున్నారు. అటు శానిటైజర్‌ను కూడా జూపార్క్‌ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. ఇక జూపార్క్‌ లోపల కూడా ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారు సంబంధిత అధికారులు. అటు పిల్లలు ఎంతో ఇష్టపడే టాయ్‌ ట్రైన్స్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ 60 మందినే అనుమతిస్తున్నారు. అటు బ్యాటరీ వేహికిల్స్‌లో కూడా 50శాతం సందర్శకులను మాత్రమే అనుమతిస్తున్నారు. అటు జంతువుల ఎన్‌క్లోజర్‌ దగ్గర కూడా శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఆరు నెలల తర్వాత రిలీఫ్‌ దొరకడంతో పిల్లలు, పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎప్పటికప్పుడు పార్క్‌లో శానిటైజేషన్‌ చేయడానికి ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories