Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులో అధికారుల నిర్లక్ష్యం.. ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు

Negligence Of Authorities In Chennur Of Mancherial District
x

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులో అధికారుల నిర్లక్ష్యం.. ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు 

Highlights

Mancherial: రోడ్లపై వ్యాపారాలు కొనసాగిస్తున్న చిరు వ్యాపారులు

Mancherial: మంచిర్యాల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం చిరు వ్యాపారులకు శాపంగా మారింది. చెన్నూరులో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో విధిలేక వ్యాపారులు ఆరుబయటనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇంటిగ్రేటర్ మార్కెట్ నిర్మాణం ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వ్యాపారుల వద్ద తైబజార్ వసూలు చేస్తున్నా.. కనీసం తాత్కాళిక షెడ్లు ఏర్పాటు చేయడం లేదని మండిపడుతున్నారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తే వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. చెన్నూర్ కూరగాయల మార్కెట్లో నిత్యం చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల నుంచి వచ్చే రైతులు వ్యాపారులు కొనసాగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో నిలువ నీడ లేక వారంతా ఎండలోనే విక్రయాలు సాగిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళా రైతులు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

ఎండా కాలంతో పాటు వర్షా కాలంలోనూ అమ్మకాలు సరిగా జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు నెలకు మూడు వందలు వసూలు చేస్తున్నా.. తమ సమస్యలను పరిష్కరించడం లేవని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories