NEET 2020 : మీరు NEET పరీక్ష రాస్తున్నారా..ఈ డ్రెస్ కోడ్ పాటించాలి

NEET 2020 : మీరు NEET పరీక్ష రాస్తున్నారా..ఈ డ్రెస్ కోడ్ పాటించాలి
x
Highlights

NEET 2020 : రాష్ట్రంలోని వైద్య కళాశాలలతోపాటు దేశంలోని ఇతర కాలేజీల్లో సీట్ సంపాదించడానికి విద్యార్ధులకు ప్రతి ఏడాది నీట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం...

NEET 2020 : రాష్ట్రంలోని వైద్య కళాశాలలతోపాటు దేశంలోని ఇతర కాలేజీల్లో సీట్ సంపాదించడానికి విద్యార్ధులకు ప్రతి ఏడాది నీట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వైద్య కళాశాలలతోపాటు దేశంలోని ఇతర కాలేజీల్లో కూడా నీట్ ర్యాంక్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈ క్రమంలోనే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (నీట్-2020)ని ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. ఈ పరీక్షతో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య, సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది నిర్వహించే నీట్ పరీక్షల్లో కొత్త రూల్ ని తీసుకొచ్చారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా ఈనెల 13న నిర్వహించనున్న నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్టీఏ డ్రెస్‌ కోడ్‌ను విధించింది. ఈ ఏడాది పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హీల్స్‌తో ఉన్న శాండల్స్‌ ధరించి రావాల్సి ఉంటుంది. ఎన్‌టీఏ గైడ్‌లైన్స్ ప్రకారం పరీక్షకు బూట్లతో అనుమతించరు. బూట్లకు బదులు స్లిప్పర్లు, శ్యాండిళ్లు మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా అడ్మిట్‌కార్డుతోపాటు వ్యాలిడ్ ఫ్రూప్‌ను తీసుకునిరావాలి.

దుస్తుల్లో లాంగ్ స్లీవ్‌లెస్‌లను అనుమతించరు, కాబట్టి సాధారణ దుస్తులను ధరించి పరీక్షకు హాజరుకావాలి. ఫుల్ స్లీవ్‌లెస్‌లను అనుమతించరు. బిగ్‌ బటన్స్‌, ఫుల్‌ స్లీవ్స్‌ దుస్తులను అనుమతించరు. నీట్‌కు హాజరయ్యే అభ్యర్థులు తేలికపాటి, హాప్ స్లీవ్‌లెస్ దుస్తులను ధరించి రావాలి. సంప్రదాయ దుస్తులు అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష హాలుకు రావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెకింగ్ చేసి లోనికి అనుమతిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories