మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు: 'ఎన్ డీ ఎస్ఏ తుది నివేదిక ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత'

NDSA final report on Medigadda may take more time
x

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు: 'ఎన్ డీ ఎస్ఏ తుది నివేదిక ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత' 

Highlights

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కొన్ని పిల్లర్లు కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి లీకేజీపై గల కారణాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్ డీ ఎస్ ఏ తుది నివేదిక సమర్పించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కొన్ని పిల్లర్లు కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి లీకేజీపై గల కారణాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్ డీ ఎస్ ఏ తుది నివేదిక సమర్పించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ చేస్తోంది.

తుది నివేదిక సమర్పణకు ఆలస్యమెందుకు?

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కోసం పదే పదే రిక్వెస్టులు పంపారు. కానీ, ఎన్ డీ ఎస్ ఏ అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదు. ఈ ఏడాది అక్టోబర్ 11న మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ డీ ఎస్ఏ నుంచి లేఖ పంపారు. అక్టోబర్ 31 నాటికి తాము అడిగిన సమాచారం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. కానీ, ఇంతవరకు ఈ సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదు. ఈ సమాచారం లేకుండా ఎన్ డీ ఎస్ ఏ తుది నివేదిక ఇవ్వలేదని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ చెప్పారు.

డిసెంబర్ చివరికి సమాచారం

ఎన్ డీ ఎస్ ఏ అడుగుతున్న సమాచారం అందించడానికి సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కొన్ని పరీక్షలు పూర్తి చేసి వాటి ఫలితాలు ఇవ్వాల్సి ఉంది. ఆ రిపోర్టులు వస్తేనే ఎన్ డీ ఎస్ ఏ కు ఈ సమాచారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగిన సమాచారం డిసెంబర్ చివరినాటికి అందించే అవకాశం ఉందని సమాచారం.

ఆధారాలు కోల్పోయాం: వెదిరె శ్రీరామ్

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు గల కారణాలను అన్వేషించేందుకు జియా టెక్నికల్, జియో ఫిజికల్ టెస్టులు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ టెస్టులు నిర్వహించలేదు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో పడిన బుంగలను కాంక్రీట్ మిక్చర్ తో గ్రౌటింగ్ చేశారు. దీంతో బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు సరైన కారణం తెలియని పరిస్థితి నెలకొంది. నవంబర్ 27న వెదిరె శ్రీరామ్ జస్టిస్ పీసీ ఘోష్ తో సమావేశమయ్యారు. ఎన్ డీ ఎస్ ఏ జులైలో సమర్పించిన రిపోర్ట్ ను అఫిడవిట్ రూపంలో ఘోష్ కు అందించారు. ఇరిగేషన్ అధికారులు తమంతట తామే ఓ కమిటీని ఏర్పాటు చేసి బుంగలను పూడ్చారని ఆయన ఆరోపించారు. బ్యారేజీ వద్ద చేసిన పనులు, రిపేర్లు, టెస్టుల వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినా విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories