హైవేలపై ప్రమాదంలో మృతి చెందితే ప్రత్యేకంగా పరిహారం లేదు

హైవేలపై ప్రమాదంలో మృతి చెందితే ప్రత్యేకంగా పరిహారం లేదు
x
Highlights

ప్రతి ఏటా జాతీయ రహదారులపై ఎన్నో ప్రమాదాలు సంభవించి ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల సంఖ్య, ప్రమాదాల్లో మృతి చెందే వారి సంఖ్య ఏడాది ఏడాదికి పెరిగిపోతూనే ఉన్నాయి.

ప్రతి ఏటా జాతీయ రహదారులపై ఎన్నో ప్రమాదాలు సంభవించి ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల సంఖ్య, ప్రమాదాల్లో మృతి చెందే వారి సంఖ్య ఏడాది ఏడాదికి పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా కుటుంబ పెద్దను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల వల్ల పలు రైతు, కూలీల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పల్లెటూళ్లలో ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురినీ సైతం ప్రమాదాలు బలితీసుకుంటున్న ఉదంతాలు ఉన్న సంగతి పలువురికి విదితమే. దీంతో మొన్నటి వరకు జాతీయ రహదారులపై మృతి చెందిన వారికి, వికలాంగులుగా మారిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించేది. కానీ ఇప్పుడు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి పరిహారం ఉండదని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తెలిపింది.

ఇక పోతే సూర్యాపేటజిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్‌ టోల్‌గేట్ల రుసుములో ఏమైనా బీమాను కలుపుతున్నారా అనే ప్రశ్నలను సంధిస్తూ సమాచార హక్కు కింద దరఖాస్తు చేసారు. దీనికి ఎన్‌హెచ్‌ఏఐ ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినపుడు వైద్యసదుపాయాలు కల్పిస్తున్నామని, టోల్‌గేట్‌ రుసుము ద్వారా వసూలు చేసిన డబ్బులో ఎలాంటి బీమా రుసుము వసూలు చేయడంలేదని తెలిపింది. అదేవిధంగా 2019 మోటారు వాహన సవరణ చట్టం ప్రకారం జాతీయ రహదారులపై తీవ్ర ప్రమాదాల్లో గాయపడ్డవారికి అంబులెన్స్‌ సౌకర్యంతోపాటు, (గోల్డెన్‌ అవర్‌) నగదు రహిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకంలో రూపే డెబిట్‌ కార్డు కలిగినవారికి ప్రమాదబీమా రూ.లక్ష వర్తిస్తుందన్నారు. అది విధానపరమైన నిర్ణయమని, అలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఎలాంటి బీమా, నష్టపరిహారం ఇవ్వడం లేదని సమాధానం ఇచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories