National Digital Library Of India: కేజీ టూ పీజీ ఫ్రీ బుక్స్.. ఎక్కడో తెలుసా..

National Digital Library Of India:  కేజీ టూ పీజీ ఫ్రీ బుక్స్.. ఎక్కడో తెలుసా..
x
national digital library
Highlights

National Digital Library Of India: విద్యార్ధులు తమకు కావలసిన పుస్తకాల కోసం గ్రంథాలయాలకు, బుక్ షాపులకు వెలుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్ధులు అలా తిరిగేందుకు వీలు లేదు

National Digital Library Of India: విద్యార్ధులు తమకు కావలసిన పుస్తకాల కోసం గ్రంథాలయాలకు, బుక్ షాపులకు వెలుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్ధులు అలా తిరిగేందుకు వీలు లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఆలోచన చేసింది. పుస్తకాల కోసం విద్యార్ధులు గ్రంథాలయాల చుట్టూ, బుక్‌షాప్‌ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా తమ చేతిలో ఎప్పుడూ ఉంటే స్మార్ట్‌ఫోన్‌లోనే సమస్త సమాచారం తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) యాప్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది.

ఈ యాప్ లో విద్యకు సంబంధించిన ప్రతి ఒక విషయం ఉంటుంది. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలు, వ్యవసాయం, సోషియలాజీ, ఆంత్రోపాలజీ, విద్య పరిశోధన, చరిత్ర, టెక్నాలజీ, కంప్యూటర్‌, సైన్స్‌ , భౌతికశాస్త్రం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర పుస్తకాలు ఈ యాప్ ఆధారంగా చదువుకోవచ్చు. అంతే కాదు టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాద్యాయులు సబ్జెక్టులు సంబంధించిన పూర్తి కంటెంట్ పెట్టనున్నారు. దాంతో పాటుగానే 100కి పైగా అభ్యసన సాధనాలు, 90 లక్షల మంది అందించిన 47 లక్షల ఆర్టికల్స్, దాదాపు 70 లక్షల పుస్తకాలు ఉంటాయి. ఇది స్థూలంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) ప్రత్యేకతలు. ఇక దీని గురించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు https://ndl.iitkgp.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెలితే పూర్తి వివరాలుంటాయి.

ఇక ఈ యాప్ ని వాడడానికి విద్యార్ధులు చేయవలసిన పెద్ద పనేంలేదు. కేవలం ఇంటర్నెట్‌ ఉంటే చాలు ఏదో ఒకచోట కూర్చొని అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. అన్నిరకాల పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఇందులో అందుబాటులో ఉంచింది. వీడియో పాఠాలను సైతం ఉచితంగా అందిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. జాతీయ విద్యా మిషన్‌లో భాగంగా జాతీయ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించింది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్‌ కూడా ఇందులో ఉంచింది.

ఖాతా రిజిష్టర్‌ ప్రాసెస్‌ ఇదే..!

నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు ఉచితంగా చదివేందుకు ముందుగా ఈ ఖాతాను తెలరవాలి. అంటే ముందుగా ఇందులో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదా ఆన్‌లైన్‌లో ఎన్‌డీఎల్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి. ఆ తరువాత వెంటనే మీ మెయిల్‌ ఐడీ ద్వారా కూడా రిజిష్టర్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తరువాత విద్యార్ధులకు ఏయే పుస్తకాలు కావాలి. ఏ విద్యాసంస్థలో చదువుతున్నారు అన్న విసయాలను అందులో పొందుపరచాలి. ఒకసారి రిజిష్టర్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా చదువుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories