తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
x

ప్రతీకాత్మక చిత్రం 

Highlights

National Best Teacher Awards : ప్రతి ఏడాది కేంద్రం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. అయితే అదే విధంగా ఈ ఏడాది కూడా కేంద్ర...

National Best Teacher Awards : ప్రతి ఏడాది కేంద్రం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. అయితే అదే విధంగా ఈ ఏడాది కూడా కేంద్ర విద్యాశాఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దేశవ్యాప్తంగా 47 మందిని ఎంపిక చేసింది. కాగా ఈ ఏడాది ఎంపిక చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు చోటు దక్కింది. ఆ అవార్డులకు ఎన్నికైన వారిలో హైదరాబాద్‌లోని మలక్‌పేట పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు ఉన్నారు. 153మంది ఉపాధ్యాయులను కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఎంపిక చేయగా వారిలో మళ్లీ వారిలో 47 మంది ఉపాధ్యాయులను షార్ట్‌లిస్ట్‌ చేసి వారికి జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది.

ఇక పోతే తెలంగాణ నుంచి ఎంపికైన ఉపాధ్యాయురాలు పద్మప్రియ హైదరాబాద్‌ మలక్‌పేటలోని నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆమెది నల్గొండ జిల్లా. ఆమె 1996లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ)గా ఎంపికయ్యారు. ఏపీపీఎస్‌సీ పరీక్షలను 1999లో రాసి స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ)గా ఎంపికయ్యారు. అప్పటి నుంచీ ఆమె గణితం సబ్జెక్టునే బోధిస్తూ వచ్చారు. ఆమె గణిత పఠాలు బోధిస్తే విద్యార్దులు నూటికి నూరు శాతం పాసయ్యారు. టీచర్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద 2016లో భారత్‌ నుంచి అమెరికా వెళ్లి శిక్షణ పొందిన ఏడుగురు ఉపాధ్యాయుల్లో పద్మప్రియ ఒకరు.

Show Full Article
Print Article
Next Story
More Stories