CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా..విజయోత్సవాల వేళ సీఎంకు బిగ్ షాక్

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా..విజయోత్సవాల వేళ సీఎంకు బిగ్ షాక్
x
Highlights

CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. అధికార పక్షంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే..ఇప్పుడు కొత్తగా...

CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. అధికార పక్షంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే..ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా కేసు ఒకటి తెరపైకి రావడం ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ మీద నటుడు నాగార్జున, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పిటిషన్లు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించే ప్లానులో కాంగ్రెస్ ఉంటు..ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ నటుడు నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వేరువేరుగా పరువు నష్టం దావాలు వేశారు. వీటిపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతున్న వేళ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసు తెరపైకి వచ్చింది. అది కూడా విజయోత్సవాలు జరుగుతున్న వేళ విచారణకు రావడం ఇప్పుడు రాజకీయా వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.

ఈ మధ్యే జరిగిన లోకసభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా బీజేపీమీద రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు పై నాంపల్లికోర్టు గురువారం రోజు విచారణ చేపట్టింది.

బీజేపీపై సీఎం చేసిన తప్పుడు ఆరోపణలు పార్టీ కాదు..ప్రధాని మోదీకి తీవ్ర పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. తీవ్రమైన అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. వాదనాలు విన్న ధర్మాసనం ఈ కేసును డిసెంబర్ 11 వరకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories