పోలీసుల చేతికి చిక్కిన నలుగురు సైబర్ నేరగాళ్లు

పోలీసుల చేతికి చిక్కిన నలుగురు సైబర్ నేరగాళ్లు
x
Highlights

పోలీస్ అధికారులు లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ తయారు చేసి వారి...

పోలీస్ అధికారులు లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ తయారు చేసి వారి స్నేహితులకు మెసెంజర్ ద్వారా డబ్బులు పంపమని మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల వ్యవహారం ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేరాలకు పాల్పడుతున్నవారిలో రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ మండల కేంద్రానికి చెందిన ముస్తఖీమ్ ఖాన్, మనీష్, షాహిద్, సద్దాం ఖాన్ లను అరెస్ట్ చేసినట్లు రంగనాధ్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో మనీష్ మైనర్ బాలుడని వెల్లడించారు. ఈ మేరకు నల్గొండలో వీరు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరంతా సాధారణంగా రోడ్ల మీద వెళ్లే వారిని బెదిరించి డబ్బులు లూటీ చేయడం మాత్రమే కాకుండా గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా అలాగే ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా చేసుకొని ఆర్మీకి చెందిన వాహనాలు, ఇతర వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లు, డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం లాంటి సైబర్ మోసాలకు పాల్పడే వారని తెలిపారు.

వీరు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారుల ఫేస్ బుక్ అకౌంట్లను ఫేక్‌గా క్రియేట్ చేసి వారి పేరుతో వారి స్నేహితుల జాబితాలో ఉన్న వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం వంటివి చేశారని వెల్లడించారు. బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు (పలు రాష్ట్రాలకు చెందినవవి) నేరాలకు వాడుతున్నారని తెలిపారు. ఇతర వ్యక్తుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అపరిచిత వ్యక్తుల నుండి 3000 రూపాయలకు వాటిని కొనుగోలు చేసి ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇలా దేశంలోని మన రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 350 మంది పోలీస్ అధికారుల ఫేస్ బుక్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. వీరిని పట్టుకోవడానికి తాము చాలా శ్రమించాల్సి వచ్చిందని అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ పోలీసుల ప్రతిష్ట నిలిపే విధంగా సమర్థంగా వ్యవహరించి తాము రాజస్థాన్ వరకూ నిందితుల కోసం వెళ్లామని అన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా అప్రమాత్రంగా ఉండాలని, సరైన అవగాహన కలిగి ఉండడం ద్వారా మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories