By-Elections 2021: ప్రారంభమైన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్

‍Nagarjuna Sagar By-Elections polling Started
x

Representational Image

Highlights

By-Elections 2021: దయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ జరగనుంది.

By-Elections 2021: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ జరగనుంది. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా 2 లక్షల 20వేల 300 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 1లక్షా, 9వేల, 228 మంది, మహిళలు 1లక్షా ,11వేల, 72 మంది ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు మొత్తం 41 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ దఫా పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచింది.

నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్‌కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింది. కాంగ్రెస్ మొదటగానే మాజీ ఎమ్మెల్యే జానారెడ్డికి అవకాశం ఇచ్చింది. బీజేపీ చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేసి రవి కుమార్ నాయక్ ను బరిలో నిలిపింది.

ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.. సాగర్ ఉప ఎన్నిక విధులు నిర్వర్తించే సిబ్బందికి అనుములలోని ఐటీఐ కాలేజీ పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు.

ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా గులాబీ పార్టీ, హస్తం పార్టీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు కాషాయ పార్టీ సాగర్‌లో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాక లో దెబ్బతినడంతో టీఆర్ఎస్ అన్ని రకాలుగా అలర్ట్ అయింది. నాగార్జునసాగర్ నుండి ప్రతి మండలంలో గ్రామంలో పార్టీ నేతలు విరివిగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షించి సూచనలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గులాబీ పార్టీ శ్రేణులంతా సాగర్‌లో ప్రచారం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories