Sagar By-Poll: సైలెంట్‌ ఓటింగ్‌ కాంగ్రెస్‌కేనా..టీఆర్ఎస్ సంగతేంటి..?

Cogress Confidence to Win Sagar By Poll
x

కాంగ్రెస్, టీఆర్ఎస్ గుర్తులు

Highlights

Sagar By-Poll: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Sagar By-Poll: నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు.. తమ బాస్‌లకు ఇంటర్నల్‌ రిపోర్టులు అందచేస్తున్నారు. గెలుపు తమదేనని ఢంకా భజాయించి చెబుతున్నారు. తక్కువ మార్జిన్‌తోనైనా గెలుస్తామని ఎవరికి వారే అంచనాలు వేస్తున్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఊహించనంతగా పోటీ పడ్డాయి. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను, నలుగురు మంత్రులను ప్రచారంలో వాడుకుంది టీఆర్‌ఎస్‌. పోల్ మేనేజ్మెంట్‌లో ఎన్ని అవకాశాలు ఉన్నాయో ...అన్ని అవకాశాలు గులాబీ పార్టీ వాడుకుంది. ప్రచారం నుంచి ఓటింగ్‌ వరకు పార్టీ నేతలు పెర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో ముందుకు నడిచారు. ఎన్నిక జరిగిన తర్వాత తమకు ఎక్కడ ఎక్కువ ఓట్లు పడ్డాయో కూడా పార్టీ నేతలు లెక్కగట్టారు. సాగర్‌లో ఉన్న 180 గ్రామాల్లో 150 గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు భారీగా ఓట్లు పడ్డాయని...కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 30 గ్రామాల్లో మాత్రమే ఓట్లు పడ్డాయని స్థానిక నేతలు సీఎం కేసీఆర్‌కు రిపోర్ట్‌ ఇచ్చారు. ఈ లెక్కన చూస్తే టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎమ్మెల్యేలు సీఎంకు ఫోన్‌లో వివరించారు.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జానారెడ్డి ప్రచారం చేయడంలోనూ...ఖర్చు పెట్టడంలోనూ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. నియోజకవర్గ ఓటర్లు సైలెంట్‌ ఓటింగ్‌ ద్వారా కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేశారని స్థానిక నేతలు జానారెడ్డికి వివరించారట. కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతోనైనా కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలు గెలుపుపై ఆశలు వదులుకున్నారు. అభ్యర్థిని చాలా లేటుగా ప్రకటించడంతో పాటు లేటుగా ప్రచారం చేయడం బీజేపీకి నష్టం కలిగించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్టీ వ్యక్తిని రంగంలో దించడం...నియోజకవర్గంలోని ఎస్టీ ఓటర్లకు డబ్బులు పంచడం వంటివి చేసినా..బీజేపీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.సాగర్‌లో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల‌ మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. ఇక‌ కొన్ని సర్వే‌ సంస్థలు, మీడియా సంస్థలు మాత్రం ‌అధికార టిఆర్ఎస్ ‌పార్టీదే గెలుపని స్పష్టం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories