CM KCR: చివరికి నా కూతురినే పార్టీ మారమని అడిగారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

My Daughter Blackmailed To Change Party Says CM KCR
x

CM KCR: చివరికి నా కూతురినే పార్టీ మారమని అడిగారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Highlights

CM KCR: తగ్గేదే లే అంటున్నారు.. బీజేపీపై ఎదురుదాడికే సై అంటున్నారు..

CM KCR: తగ్గేదే లే అంటున్నారు.. బీజేపీపై ఎదురుదాడికే సై అంటున్నారు.. కేంద్ర సంస్థల దాడులను ప్రతిఘటిద్దాం అని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంపై బీజేపీ కుయుక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన టీఆర్ఎస్‌ ఎల్పీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోరాటం చేయాల్సిందే అని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈడీ దాడులకు పాల్పడితే ఎక్కడ సోదాలు నిర్వహిస్తే అక్కడే ధర్నాలు చేయాలని తిరగబడాలని సూచించారు. అంతేకాదు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ తన కూతురు కవితను కూడా పార్టీ మారాలని బీజేపీ నేతలు అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా అని మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో పోరాడాల్సిందే అని స్పష్టం చేశారు.

ఫామ్‌ హౌజ్‌ ఎమ్మెల్యేలతో సమావేశానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇతర నాయకుల నిఘా ఉంటుందని తేల్చిచెప్పారు. ఫోన్‌లో ఏది మాట్లాడినా తెలుస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో చర్చించిన కీలక వివరాలు ఎక్కడా లీక్ కావొద్దని హెచ్చరించారు.

మరోవైపు వచ్చే 10 నెలలు చాలా కీలకం అని సీఎం కేసీఆర్ క్యాడర్‌కు సూచించారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయని స్పష్టం చేశారు. మంత్రులంతా జిల్లా కేంద్రాల్లోనే ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. సిట్టింగులకే మళ్లీ సీట్లిద్దామని సంకేతాలిచ్చారు. అలాగే ధరణీ సమస్యల కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని పోడు భూముల సమస్యను పరిష్కరిద్దామని తేల్చిచెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories