టీఆర్‌ఎస్‌లో సైలెంట్‌గా ఉంటున్న ఆ సామాజిక వర్గం నేతలు.. కౌంటర్ ఎటాక్ ఎందుకు..

Munnuru Kapu Leaders Silence in TRS Party
x

టీఆర్‌ఎస్‌లో సైలెంట్‌గా ఉంటున్న ఆ సామాజిక వర్గం నేతలు.. కౌంటర్ ఎటాక్ ఎందుకు..

Highlights

TRS Party: టీఆర్ఎస్‌లో ఓ సామాజిక వర్గం నేతలు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు.

TRS Party: టీఆర్ఎస్‌లో ఓ సామాజిక వర్గం నేతలు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు. ఓ జాతీయ పార్టీలో అదే సామాజిక వర్గం నేతలు టీఆర్ఎస్ అధిష్టానంపై విరుచుకుపడుతున్నా కౌంటర్ ఎటాక్ ఎందుకు చేయడం లేదు. రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతున్నా ఆ సామాజిక వర్గం నేతలు నోరు మెదపక పోవటంపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేతలు ?

రాష్ట్రంలో పొలిటికల్ వెదర్ హీటెక్కింది. అధికార పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. తీన్మార్ మల్లన్న అయితే ఏకంగా కేసీఆర్ కుటుంబ సభ్యులపైనే బాణాలు ఎక్కుపెట్టారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేసీఆర్, కేటీఆర్‌ను వదిలిపెట్టడం లేదు.

బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చేస్తున్న కామెంట్లకు కొంత మంది టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రమే రీకౌంటర్‌ ఇస్తున్నారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు. అయితే ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతలు టీఆర్‌ఎస్‌లో ముఖ్యమైన పదవుల్లో చాలా మందే ఉన్నారు.

టీఆర్ఎస్‌లో మున్నూరు కాపు సామాజిక వర్గంలో పెద్ద మనిషిగా ఉన్న కేశవరావు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్, పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్నారు. ఇక ఆయనతో పాటు అయన కుటుంబ సభ్యులు వివిధ హోదాలో పదవులు అనుభవిస్తున్నారు. అయినా కేకే మాత్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం తప్పా అధిష్టానానికి మద్దతుగా మాట్లాడిన సందర్భాలు తక్కువేనన్న చర్చ గులాబీ వర్గాల్లో ఉంది.

ఇక ఎమ్మేల్యేలు కాలేరు వెంకటేష్, కోరుకంటి చందర్, చీప్ విప్ వినయ్ భాస్కర్, జోగు రామన్న తో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు కాపు సామాజికి వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. కానీ వీరంతా సైలెంట్‌గా ఉంటున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్థన్ లు మాత్రమే బీజేపీలోని సొంత సామాజిక వర్గం నేతలపై అటాక్‌ చేస్తున్నారని తెలంగాణభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఎమ్మెల్యేలే కాదు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలకు వివిధ హోదాల్లో పదవులు కట్టబెట్టారు కేసీఆర్. వారు కూడా పదవులను ఎంజాయ్ చేస్తున్నారు తప్పా పార్టీ కోసం సరిగ్గా పనిచేయటం లేదని కారు పార్టీలోని ఇతర సామాజిక వర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సొంత సామాజిక వర్గ నేతలే కౌంటర్ ఇవ్వకుంటే తాము ఎందుకు స్పందించాలని పార్టీ పెద్దల ముందు మొరపెట్టుకుంటున్నారట. దీంతో పార్టీ పెద్దలు ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories