Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వాడిపోతున్న వేపచెట్లు

Municipal Officials Chemical Treatment to Neem Trees Dying in Mahabubnagar District
x

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాడిపోతున్న వేపచెట్లు(ఫైల్ ఫోటో)

Highlights

*వేపచెట్లకు కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తున్న వైద్య, మున్సిపల్‌ అధికారులు

Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేపచెట్లు వాడిపోతూ ఆశ్చర్యానికి గురిచేసిన అంశం అందరికి తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు ఎండిపోవడానికి అంతుచిక్కని వ్యాది కారణమా? లేక మరేదైనా మూడనమ్మకమా? అన్న ఆందోళనలో జిల్లా ప్రజలున్నారు. ఐతే కారణమేమైన జిల్లాలో వాడిపోతున్న వేప చెట్లకు నివారణ చర్యలను చేపట్టారు వైద్య, మున్సిపల్ అదికారులు.

అదికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వేప చెట్లకు రసాయనలతో పిచికారి చేస్తున్నారు. ఒక్క మహబూబ్ నగర్ పట్టణంలోనే వందకుపైగా వేపచెట్లు ఎండిపోవడంతో వాటికి పిచికారి చేసి కాపాడే ప్రయత్నం చేయడం పట్ల స్థానికులు మున్సిపల్ అదికారులను, సిబ్బందిని అభినందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో నివారణ చేపట్టాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories