మారుమూల గిరిజనులను అమ్మలా ఆదుకుంటున్న ఎమ్మెల్యే సీతక్క!

మారుమూల గిరిజనులను అమ్మలా ఆదుకుంటున్న ఎమ్మెల్యే సీతక్క!
x
Highlights

ములుగు ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తూ,...

ములుగు ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తూ, కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి నిత్యావసరాలు అందజేస్తున్నారు. లాక్‌డాన్‌ అమల్లోకి వచ్చినప్పట్టి నుంచి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. మారుమూల కొండ ప్రాంతాల్లోకి వెళ్లి మరీ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో వాహనాలు వెళ్లలేని చోటుకి కూడా వెళ్తున్నారామె. ఎటువంటి రవాణా మార్గం లేని ప్రాంతాలకు సైతం నడుచుకుంటూ వెళ్లి ఆదుకుంటున్నారామె. వాజేడు మండలం.. పెనుగోడు గ్రామానికి 16 కిలోమీటర్లు నడిచి వెళ్లి నిత్యావసరాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సీతక్క. స్వయంగా తానే మూటలు కూడా మోసుకుని వెళ్లి సరుకులను పంపిణీ చేశారారు. ములుగు సబ్​రిజిస్ట్రార్​తస్లీం మహ్మద్​తో కలిసి వెళ్లిన సీతక్క అక్కడి ప్రజలకు నిత్యావసరాలను అందజేశారు. కష్టకాలంలో అడవిలో అంతదూరం కాలినడకన వెళ్లి పేదల ఆకలి తీర్చిన సీతక్కను అంతా అభినందిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories