Mangapet:వడ్డెర కాలనీలో నిత్యావసర సరుకుల పంపిణీ...

Mangapet:వడ్డెర కాలనీలో నిత్యావసర సరుకుల పంపిణీ...
x
Highlights

మంగపేట మండలం మల్లంపల్లి గ్రామములోని వడ్డెర కాలనీ, దళిత వాడ లోని రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్న వందమంది పేద కుటుంబాలకు బియ్యం కూరగాయాలు దాతల సహాయముతో పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మంగపేట మండలం మల్లంపల్లి గ్రామములోని వడ్డెర కాలనీ, దళిత వాడ లోని రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్న వందమంది పేద కుటుంబాలకు బియ్యం కూరగాయాలు దాతల సహాయముతో పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్బంగా మాట్లాడుతూ... కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైనదో ప్రతి గ్రామానికి చెప్పుకుంటూ వెళ్తూ కరోనా వైరసు కి వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు అని నివారణ ఒకటే మార్గమని, ముఖ్యంగా కరోనా వైరస్ అంటువ్యాధి అని ఒకరి నుండి ఒకరికి అత్యంత తొందరగా చేరుకుంటుందని అందుకే ఈ అత్యవసర స్వీయ గృహ నిర్బంధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, మాజీ సర్పంచ్ గోల్కొండ రవి, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, ల్యాద శ్యామ్ రావు, డాక్టర్ రవిబాబు, చంద రాము, ములుగు ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, అనిల్ రెడ్డి, నాగుల శ్రీకాంత్, కొలిపాక శ్రీనివాస్, కొంగరి నరేందర్, రాజిరెడ్డి, కర్ణాకర్ రెడ్డి, మాచర్ల రాజు, సురేష్, ఎనుము శ్రీను, ల్యాద లక్ష్మణ్, కొంగరి పైడి, విజేందర్, దేవరనేని సుధాకర్ రావు, ముత్యాల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ఐలయ్య, ఆకుతోట చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories