టీఆర్‌ఎస్ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

టీఆర్‌ఎస్ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి
x

టీఆర్‌ఎస్ వైఖరిని తప్పుబట్టిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

Highlights

*పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం *ప్రసంగానికి 18 ప్రతిపక్షాల గైర్హాజరు.. హాజరైన టీఆర్‌ఎస్‌

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి టీఆర్‌ఎస్‌ హాజరుకావడాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ప్రతిపక్షాలకు చెందిన 18 పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా హాజరుకావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏతో సీఎం కేసీఆర్‌ చీకటి భాగస్వామ్యం చేసుకున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరిస్తే టీఆర్‌ఎస్‌ హాజరైందన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. అలా కాకుండా ప్రధాని నరేంద్రమోదీ తెచ్చిన చట్టాలకు టీఆర్‌ఎస్‌ ఆమోదం తెలిపిందని విమర్శించారు.

రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. శనివారం ఆర్మూరులో రాజీవ్ రైతు భరోసా దీక్ష జరుగుతుందన్నారు. రాంమాధవ్‌ సమక్షంలో ఇచ్చిన పసుపు బోర్డు హామీ ఏమైందని ప్రశ్నించారు. నిజామాబాద్‌ రైతులను ఎంపీ అరవింద్ వంచించారని రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories