ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల కదలికలు.. భయాందోళనకు గురవుతున్న జిల్లా వాసులు

movements of tigers in adilabad district residents of the district are panicking
x

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల కదలికలు

Highlights

* నిన్న కేశవపట్నం గ్రామంలో మేకలమందపై పులి పంజా.. గ్రామస్తులు కేకలు వేయడంతో పారిపోయిన పులి

Tiger Tension In Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల కదలికలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగజ్‌నగర్‌ ప్రాంతంలో పులి సంచారంతో ఇళ్ల నుంచి బయటకురావాలంటేనే జనం వణికిపోతున్నారు. నిన్న కేశవపట్నం గ్రామంలో మేకలమందపై పులి దాడి చేసింది. గ్రామస్తులు కేకలు వేయడంతో పారిపోయింది. మరోవైపు పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరో పక్క మైక్ ద్వారా ప్రచారం చేపట్టారు. పశువుల కాపర్లు, మేకల కాపర్లు వ్యవసాయ పనులకు వెళ్లేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories