MLC Kavitha: ఇవాళ ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha will Attend ED inquiry Today in Delhi Liquor Scam
x

MLC Kavitha: ఇవాళ ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

Highlights

MLC Kavitha: లిక్కర్ స్కామ్‌లో కవితను ప్రశ్నించనున్న ఈడీ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో ఇవాళ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈ నెల 11న సుమారు 9 గంటల పాటు కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. 16వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ ముందు హాజరుకానున్నారు.

ఉదయం 11 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. లిక్కర్‌ పాలసీ రూపకల్పన, సౌత్‌గ్రూపు పాత్ర, ఆప్‌ నేతలకు ముడుపులు తదితర అంశాలపై ప్రశ్నించడంతో పాటు బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైతో కలిపి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ బుచ్చిబాబును ఈడీ అధికారులు నిన్న విచారించారు. ఆయనను అరుణ్‌ పిళ్లైతో కలిపి ప్రశ్నించినట్టు తెలిసింది. కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరినీ విచారించారని.. సాక్ష్యాల ధ్వంసం, మద్యం విధాన రూపకల్పన, హోటళ్లలో భేటీ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నించారని సమాచారం.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాంలో ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఆమెకు మద్దతు అందించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్‌తోపాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించడంతోపాటు అక్కడి పరిణామాలను మంత్రులు ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories