MLC Kavitha: కాసేపటికే తేరుకుని ప్రచారాన్ని ప్రారంభించిన కవిత
MLC Kavitha: జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఎన్నికల ప్రచార వాహనాన్ని దిగి స్థానికంగా ఉన్న ఓ కార్యకర్త ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. కాసేపటి తర్వాత కవిత తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చిందని..చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డిహైడ్రేషన్ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురై కాసేపు విశ్రాంతి తీసుకున్న కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించారు. ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కు మద్దతుగా కవిత ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మాట్లాడుతున్న సమయంలో కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి, కిందకు దిగారు కవిత.
Sorry for the little scare. I’m doing just well, also happened to have met this sweet little girl and after spending time with her I’m feeling a little more energetic. #KCROnceAgain campaign to resume shortly. ✊🏻 pic.twitter.com/YaO1Siw7Vk
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire