MLC Kavitha: అందులో మహిళా బిల్లు అంశం లేకపోవడాన్ని తప్పుబట్టిన కవిత
MLC Kavitha:మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆమె నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ముఖ్యమైన జాతీయ అంశం కాదా అని ప్రశ్నించారు కవిత. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. అందులో మహిళా బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నించారు.
Saddened to see that the urgency for discussing Women's Reservation Bill was completely ignored in Congress Parliamentary Party Chairperson and MP Smt. Sonia Gandhi Ji's letter to the Prime Minister.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2023
Mrs. Gandhi Ji, the nation awaits your powerful advocacy for gender equality.… https://t.co/RHlQAbLPz8
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire