Kavitha: ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు.. 6న సీబీఐ విచారణకు హాజరుకాలేను

MLC Kavitha Letter to CBI
x

Kavitha: ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు.. 6న సీబీఐ విచారణకు హాజరుకాలేను

Highlights

Kavitha: సీబీఐకి మరోసారి ఎమ్మెల్సీ కవిత లేఖ

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు గంట గంటకో మలుపు తిరుగుతోంది. లిక్కర్ స్కాం ఎఫ్‌ఐఆర్ కాపీలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని తొలుత ప్రచారం జరిగినా..దాంట్లో తన పేరు ఎక్కడా లేదని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరోసారి లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీలో తన పేరు లేకపోయినా..నిందితుల లిస్టులోనూ తన పేరు లేకపోయినా...తాను చట్టాన్ని గౌరవిస్తానని..సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తానని కల్వకుంట్ల కవిత ట్విస్ట్ ఇచ్చారు. అయితే తాను ముందస్తుగా ఖరారు చేసుకున్న కార్యక్రమాల కారణంగా రేపు సీబీఐ విచారణహకు హాజరుకాలేనని సీబీఐకి రాసిన లేఖలో కవిత స్పష్టం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు ఉందని తొలుత ప్రచారం జరగడంతో..ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు పంపించాలని శనివారంనాడు సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆమె విజ్జప్తి మేరకు స్పందించిన సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీని కవితకు పంపించారు. సీబీఐ అధికారులు పంపిన ఎఫ్‌ఐఆర్ కాపీని తాను క్షుణ్ణంగా చదివానని..ఎక్కడా తన పేరు లేదని..నిందితుల లిస్టులోనూ తన పేరు లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories