MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఫైట్

MLC Kavitha Fights for Women Reservation Bill
x

MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఫైట్

Highlights

MLC Kavitha: రాజకీయ పార్టీలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత లేఖలు

MLC Kavitha: నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు చారిత్రక అవసరమని, చట్టసభల్లో సరిపడా మహిళల ప్రాతినిధ్యం ఉంటేనే దేశం పురోగమిస్తుందని అభిప్రాయపడ్డారు.

దేశంలో మహిళల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, దేశ జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. అయినప్పటికీ, చట్టసభల్లో మాత్రం మహిళల ప్రాతినిధ్యం సరిపడా లేదన్నారు. ఈ వైరుధ్యం దేశ పురోగతికి విఘాతం కలిగిస్తోందని, ప్రజాస్వామ్య సూత్రాలను బలహీన పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories