చదువుల తల్లి హారికకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత.. ఎంబీబీఎస్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ..
MLC Kavitha: యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.
MLC Kavitha: యూట్యూబ్‌లో క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారికకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. hmtv లో ప్రసారమైన కథానాలకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఐదేళ్ల ఎంబీబీఎస్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం ఫీజును చెక్కు రూపంలో అందజేశారు. చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని కవిత అన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించిందని అభినందించారు. తనకున్న వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరమని తెలిపారు. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. హారిక ఎంబీబీఎస్ చదువులో రాణించి , వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Dare to dream and then never stop working until you achieve them.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2022
This is the story of Harika,who passed and excelled in the MBBS exams via YouTube videos. I met her and her mother and extended my support towards her dreams by handing over the first installment of her fees
(1/2) pic.twitter.com/8NIUqSk91e
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire