MLC Kavitha: మోడీ సర్కార్‌ తలుచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది..

MLC Kavitha Ends Her One-day Hunger Strike
x

MLC Kavitha: మోడీ సర్కార్‌ తలుచుకుంటే ఈ బిల్లు పాసవుతుంది..

Highlights

MLC Kavitha: ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది.

MLC Kavitha: ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో దీక్ష చేపట్టిన ఆమె మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమన్నారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. రాజకీయాల్లోనూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని.. 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకూ విశ్రమించేది లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉందని.. అదే విధంగా అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories