MLC Kavitha: కట్టుకథలు చెప్పడం మానండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

MLC Kavitha Counter To Kishan Reddy
x

 కట్టుకథలు చెప్పడం మానండి.. కిషన్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

Highlights

MLC Kavitha: కేంద్రప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందని.. అబద్దాలను వ్యాప్తి చేయవద్దు

MLC Kavitha: కరెంటు సరఫరాపై కట్టు కథలు చెప్పడం మానేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోందంటూ కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనికి కవిత ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15వేల, 500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందని కవిత తెలిపారు.

అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీపీసీతో వస్తోంది కేవలం నాలుగు శాతం మాత్రమేనని స్పష్టం కవిత స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని కిషన్‌రెడ్డికి, కవిత సూచించారు. సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసిఆర్‌దేనని కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories