MLC Kavitha: రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్‌

Mlc Kavitha Brought To Delhi Rouse Avenue Court
x

MLC Kavitha: రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్‌

Highlights

MLC Kavitha: సీబీఐ కస్టడీ పిటిషన్‌పై మధ్యాహ్నం కొనసాగనున్న వాదనలు

MLC Kavitha: ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీకి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును మధ్యాహ్నం 2 గంటలకు రిజర్వ్ చేసింది కోర్టు. కవితను విచారించాలన్న సీబీఐ అభ్యర్థనపై మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపింది కోర్టు. అయితే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనను కోర్టు అనుమతి లేకుండా సీబీఐ అరెస్టు చేసిందని కోర్టుకు తెలిపారు కవిత.

ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేసినట్లు తెలిపింది సీబీఐ. కవిత అరెస్టు విషయంలో సీబీఐ అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. అయితే అరెస్టుకు ముందు రోజు రాత్రి పదిన్నర గంటలకు జైలు అధికారులు తనకు సమాచారమిచ్చినట్లు కోర్టుకు తెలిపారు కవిత. తన న్యాయవాదులతో మాట్లాడేందుకు టైమ్ కావాలని కోరినట్లు చెప్పారు. సీబీఐ అరెస్ట్ అక్రమం, వారు చేస్తోంది తప్పంటూ కోర్టుకు తెలిపారు ఎమ్మెల్సీ కవిత.

Show Full Article
Print Article
Next Story
More Stories