MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో మెగా జాబ్ మేళా చరిత్రలో నిలిచిపోతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్నారు.
MLC Kalvakuntla Kavitha: తెలంగాణలో మెగా జాబ్ మేళా చరిత్రలో నిలిచిపోతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై కవిత స్పందించారు. 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్లు నేటి నుంచే వెలువడుతాయని సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించి చరిత్ర సృష్టించారని కవిత ప్రశంసించారు.
నిరుద్యోగుల్లో ఆశలను కేసీఆర్ సజీవంచేశారని అభిప్రాయం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల కుటుంబాల్లో కేసీఆర్ సంతోషం నింపారని పేర్కొన్నారు. 80,039 ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మరో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
CM Sri #KCR garu creates history as we continue to excel in his able leadership! 95% jobs for the locals of our state as the Hon'ble CM announces 80,039 State Govt. job openings and regularising 11,103 contractual jobs after fulfilling the promise of giving 1,32,899 Govt jobs pic.twitter.com/wCay031au7
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 9, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire