MLA Poaching Case: సిట్‌కు చుక్కెదురు.. హైకోర్టు కీలక తీర్పు..

MLAs Will Be Lured To The SIT In The Case
x

MLA Poaching Case: సిట్‌కు చుక్కెదురు.. హైకోర్టు కీలక తీర్పు..

Highlights

MLA Poaching Case: ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేసిన సిట్‌

MLA Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌కు చుక్కెదురయ్యింది. సిట్‌ మెమోను హైకోర్టు రిజెక్ట్‌ చేసింది. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గు స్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చాలని సిట్‌ మెమో దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్‌ చేసింది. సిట్‌ రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేవేసింది.

ఎమ్మెల్యేలకు ఎరకేసు లో సిట్‌ దాఖలు చేసిన మెమోను అనిశా కోర్టు కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. భాజపా నేత బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ వెల్లాపల్లి, శ్రీనివాస్‌లను ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ గతంలో సిట్‌ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గుర్నీ నిందితులుగా చేర్చడాన్ని తోసిపుచ్చిన అనిశా కోర్టు ఇటీవల సిట్‌ మెమోను కొట్టివేసింది. దీంతో సిట్‌ బృందం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సిట్‌ అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories