Seethakka: హోంమంత్రి అసహనంగా ఉన్నారు.. తక్షణమే గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలి

MLA Seethakka Reacted To The Behavior Of Home Minister Mahmood Ali
x

Seethakka: హోంమంత్రి అసహనంగా ఉన్నారు.. తక్షణమే గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలి

Highlights

Seethakka: అలాంటివారి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు

Seethakka: గన్‌మెన్‌పై చేయి చేసుకున్న హోంమంత్రి మహమూద్‌ అలీ.. తక్షణమే ఆ గన్‌మెన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే సీతక్క. మంత్రి తలసాని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మహమూద్‌ అలీ.. గన్‌మెన్‌ చెంపపై చెల్లుమనిపించారు. ఈ ఘటనపై స్పందించిన సీతక్క.. హోంమంత్రి అసహనంగా ఉన్నారని చెప్పారు. తాము ప్రజల్లో తిరుగుతుంటే.. గన్‌మెన్లు తమను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని, అలాంటివారి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదన్నారు. పోలీసులు అంటే తమకు అభిమానం, గౌరవం ఉందని చెప్పారు. తక్షణమే గన్‌మెన్‌కు హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే సీతక్క.

Show Full Article
Print Article
Next Story
More Stories