Danam Nagender: మంత్రులిద్దరూ వెంటనే రాజీనామా చేయాలి

MLA Danam Nagender Comments on Union Minister Nirmala Sitharaman Over Budget 2024
x

Danam Nagender: మంత్రులిద్దరూ వెంటనే రాజీనామా చేయాలి

Highlights

Danam Nagender: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

Danam Nagender: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఏపీ పునర్విభజన చట్టంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయన్న విషయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియదా? అంటూ ప్రశ్నించారు. దేశానికి ఇలాంటి ఆర్ధిక మంత్రి ఉండటం అరిష్టమని, తెలంగాణ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలన్నారు.

నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదు అని డీలర్, కలెక్టర్‌ను ప్రశ్నించారని దానం నాగేందర్ అన్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వస్తారని ఆయన ప్రశ్నించారు. మూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నోసార్లు అడిగారని చెప్పారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories