Kidnap Case: కామారెడ్డి జిల్లా కేంద్రంలో సినిమాను తలపించిన సంఘటన
Kidnap Case: మూడేళ్ల వయస్సులో అదృశ్యమైన ఓ చిన్నోడు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షం అయ్యాడు. సినిమాలు సీరియళ్లలో కనిపించే అలాంటి దృశ్యం నిజ జీవితంలోను నిజమైంది. వినడానికి విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉన్నా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ బాలుడు కిడ్నాప్ మిస్టరీ మూడేళ్ల తర్వాత వీడింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన గోపి-ఉమ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు గణేష్ 2018 ఏప్రిల్ 13న ఇంట్లో ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. ఓ కిడ్నాపర్ బాబును హైదరాబాద్ కు చెందిన దంపతులకు అమ్మేశాడు. కిడ్నాప్ చేస్తన్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
రోజరోజుకు ఆశలు సన్నగిల్లి ఇక దేవునిపై భారం వేశారు. ఆ దేవుడే కిడ్నాపర్ రూపంలో వాళ్లింటికొచ్చాడు. ముషిరాబాద్ లో ఓ దంపతులకు లక్షన్నరకు బాలున్ని అమ్మేసినట్లు కిడ్నాపర్ ఒప్పుకుని వారికి సమాచారం ఇచ్చాడు. ఎట్టకేలకు బాబు ఆచూకి లభించి కన్నతల్లి ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బైపోతున్నారు.
కామారెడ్డి డ్రైవర్స్ కాలనీ ప్రాంతంలో ఉండే భార్యభర్తలు మరో మహిళతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని చిన్న పిల్లలను టార్గెట్ చేశారు. ఇలా కామారెడ్డిలోనే ముగ్గురు పిల్లలను అపహరించారు. ప్రస్తుతం ఆ కేసులన్నీ చేధించారు పోలీసులు. గణేష్ విషయంలో జరిగింది అద్బుతమో దేవుని మహిమో తెలియదు కానీ ఓ తల్లి మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. అమ్మ ప్రేమ గెలిచింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire