కంటోన్మెంట్‌లో డబుల్‌ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు

కంటోన్మెంట్‌లో డబుల్‌ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు
x

కంటోన్మెంట్‌లో డబుల్‌ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు

Highlights

*కళకళలాడుతున్న గాంధీనగర్‌, సాయిరాం నగర్‌లు ప్రస్తుతం *లబ్ధిదారులు కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని మరిచిపోకూడదు-సాయన్న *టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటోన్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది-తలసాని *భారత దేశంలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి-మంత్రి మల్లారెడ్డి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో నిర్మించిన 264 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని గాంధీనగర్, శ్రీరాంనగర్‌లో సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో శ్రీరాంనగర్‌లో జీ+3 అంతస్తుల్లో 64 ఇండ్లు, గాంధీనగర్‌లో జీ+3 అంతస్తుల్లో 200 రెండు పడకల ఇండ్లు ఉన్నాయి. ఈ కాలనీల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, లిఫ్ట్‌ సౌకర్యం, ఫైర్‌ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలతోపాటు అత్యాధునిక వసతులు కల్పించారు.

కేసీఆర్‌పై సాయన్న ప్రశంసల వర్షం కురిపించారు. లబ్ధిదారులు కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని మరిచిపోకూడదని అన్నారు. భారత దేశంలో 62 కంటోన్మెంట్లు ఉండగా వాటిలో ఎక్కడా లేని విధంగా మన సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో అభివృద్ధిలో జరుగుతోందని మంత్రి మల్లారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

పేదోళ్లపై ఒక్క రూపాయి భారం పడకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటోన్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నదని వెల్లడించారు. గతంలో మురికివాడలుగా ఉన్న గాంధీనగర్‌, సాయిరాం నగర్‌లు ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. ఉన్నత ప్రమాణాలతో నిర్మితమైన గృహాలు వారికి ఆహ్వానం పలుకుతున్నాయి. కొత్తగా నిర్మితమైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అన్ని సౌకర్యాలతో చూడముచ్చటగా ఉన్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories