జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి వేముల

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి వేముల
x
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబిపూర్‌రాజుతో...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబిపూర్‌రాజుతో మంత్రి వేముల సమావేశమయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి వేముల అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు మంత్రి వేముల. ‎

Show Full Article
Print Article
Next Story
More Stories