Thummala: రూ. 2 లక్షల పైబడి రుణం.. మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

Minister Tummala Nageswara Rao Says Good News For Farmers
x

Thummala: రూ. 2 లక్షల పైబడి రుణం.. మంత్రి తుమ్మల గుడ్ న్యూస్

Highlights

Thummala Nageswara Rao: రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Thummala Nageswara Rao: రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రుణమాఫీ చేశామని..త్వరలోనే షెడ్యూల్ ప్రకటించి మిగతా వారి రుణాలను కూడా మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్దారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల రుణమాఫీ కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాపీ చేశారా అని ఆయన అడిగారు.

రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని ఆయన చెప్పారు. గాంధీభవన్‌లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలను స్వీకరించారు తుమ్మల. భూ సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు సమస్యలపై మొత్తం 98 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్లతో మాట్లాడి ఈ సమస్యలను పరిష్కరిస్తామనిఆయన హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories