Minister Tummala: ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేం.. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇస్తాం..

Minister Tummala Nageswara rao key Announcement on Rythu Bharosa
x

Minister Tummala: ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేం.. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇస్తాం..

Highlights

Rythu Bharosa: ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని, క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

Rythu Bharosa: ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని, క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని చెప్పారాయన.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని తెలిపారు మంత్రి.

42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేశామని, రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్ల రూపాయలు అవసరమని, ఆగస్టు 15వ తేదీన 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పారు. 2 లక్షల రూపాయలకు పైగా ఉన్న రైతులు డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందన్నారు. 2 లక్షలకు పైన ఉన్న రుణాల రైతుల అంశం క్యాబినెట్‌లో చర్చిస్తామని, షెడ్యూలు ప్రకటిస్తామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories