Srinivas Goud: ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం

Minister Srinivas Goud Serious on AP Ministers
x

Srinivas Goud: ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం

Highlights

Srinivas Goud: ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో..

Srinivas Goud: ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ తో పాటు మంత్రులు తెలంగాణలో ఉన్న సీమాంద్ర ప్రజలు ఇబ్బందులు పడుతారని అనడం విచారకరమన్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌టం లేద‌న్నారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌న్నారు. తెలంగాణ ప్రాంతప్రజలు అవస్థలు పడుతుంటే ఏపీ ప్రభుత్వం 40 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోవడంతో తాము బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ర్టం విడిపోయిన తర్వాత సీమాంధ్ర ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడిందా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్రులు కలిసిమెలసి వ్యవసాయం చేసుకుంటున్నారని అయినా ఏపీలో మాత్రం తెలంగాణ వారిని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అయినా ఆ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు.. ఈ విషయం కృష్ణా బోర్డుకు తెలియంది కాదన్నారు. రెండు రాష్ర్టాలు పరస్పరం సహకరించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories