Sridhar Babu: అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
Sridhar Babu: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రజా పాలనను ప్రారంభించిందని శ్రీధర్ బాబు అన్నారు. సమాచారాన్ని సేకరించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న ఆయన..అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire