Satyavathi Rathod: హోటల్ సిబ్బందికి ఆమ్లెట్‌ వేసి వడ్డించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

Minister Satyavathi Rathod Served Omelet To The Hotel Staff
x

Satyavathi Rathod: హోటల్ సిబ్బందికి ఆమ్లెట్‌ వేసి వడ్డించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

Highlights

Satyavathi Rathod: తొర్రూరు సమీపంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ సందడి

Satyavathi Rathod: రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా గడిపే మంత్రి సత్యవతి రాథోడ్ ఓ హోటల్‌లో స్వయంగా ఆమ్లెట్ వేసి సందడి చేశారు. మహబూబాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో తొర్రూరులోని రోడ్డు సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్ద సత్యవతి రాథోడ్‌ ఆగారు. హోటల్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో మంత్రి ముచ్చటించారు. వారు వంట చేస్తుండగా వారితో కలిసి మంత్రి స్వయంగా ఆమ్లెట్ వేసి సిబ్బందికి వడ్డించారు. దీంతో హోటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులకు తానే స్వయంగా వంట చేసి పెడతానని మంత్రి సత్యవతి రాథోడ్‌ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories