Minister Sabita Indrareddy On Online Classes : విద్యాశాఖ త‌ర‌పున మూడు ర‌కాల స‌ర్వే చేశాం : మ‌ంత్రి స‌బిత‌

Minister Sabita Indrareddy On Online Classes : విద్యాశాఖ త‌ర‌పున మూడు ర‌కాల స‌ర్వే చేశాం : మ‌ంత్రి స‌బిత‌
x

Minister Sabita Indrareddy 

Highlights

Minister Sabita Indrareddy On Online Classes : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఒక్కసారిగా వజృంభించడంతో దాని ప్రభావం దేశంలోని అన్ని సంస్థలపై, అన్ని...

Minister Sabita Indrareddy On Online Classes : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఒక్కసారిగా వజృంభించడంతో దాని ప్రభావం దేశంలోని అన్ని సంస్థలపై, అన్ని రంగాలపై పడింది. ఏ రంగాల సంగతి ఎలా ఉన్నప్పటికీ విద్యారంగంపై మాత్రం దీని ప్రభావం కాస్త ఎక్కవగానే కాస్త ఎక్కువగానే పడిందని చెప్పుకోవచ్చు. దీంతో విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇకపోతే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాఠ‌శాల‌ల ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌పై మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కరోనా మహమ్మారి బారిన విద్యార్ధులు పడకూడదనే ఉద్దేశంతో మార్చి 16 నుంచి పాఠ‌శాల‌ల‌ను మూసివేసారని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా ఆందోళ‌న నెల‌కొందని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు పాఠ‌శాల‌లు తెరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులకు రూప‌క‌ల్ప‌న చేశామ‌ని స్పష్టం చేసారు. విద్యా సంస్థ‌లు తెరిచేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌నుంది.

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులంద‌రినీ పాస్ చేశామ‌న్నారు. విద్యాశాఖ త‌ర‌పున మూడు ర‌కాల స‌ర్వే చేశామ‌ని చెప్పారు. విద్యార్థులంద‌రికీ ఉచితంగా బుక్స్‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు. రాష్ర్టంలో 85 శాతం మంది విద్యార్థుల నివాసాల్లో టీవీ ఉంద‌ని స‌ర్వేలో తేలింద‌న్నారు. స‌ర్వేలో 40 శాతం విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నట్టు తేలిందని తెలిపారు. 48 వేల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆన్‌లైన్ బోధ‌న‌ను అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. దూర‌ద‌ర్శ‌న్‌, టీ శాట్ యాప్‌లో డిజిట‌ల్ క్లాసులు అందుబాటులో ఉంచామ‌న్నారు. టీవీ, స్మార్ట్ ఫోన్లు లేని వారిని ప‌క్క‌వారితో అనుసంధానం చేశామ‌ని తెలిపారు. విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వ‌ర్క్ షీట్స్ త‌యారు చేశామ‌ని చెప్పారు. విద్యార్థులంద‌రూ ఆన్‌లైన్ క్లాసులు వింటున్నార‌ని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories