Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ చార్జ్ షీట్‌లపై స్పందించిన మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

Minister Ponnam Prabhakar Respond on BJP and BRS Charge Sheets
x

Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ చార్జ్ షీట్‌లపై స్పందించిన మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

Highlights

Ponnam Prabhakar: ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Ponnam Prabhakar: ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జిషీట్ కాదు రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విమర్శలు కురిపిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే చార్జిషీట్ అని ఇస్తే ఇది భవ్యం కాదన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన రిప్రజంటేషన్ లో అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన నెలకు ప్రభుత్వం ఎలా నడుస్తుందని, పిల్లి శాపనార్థాలు పెట్టారని, ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారని తెలిపారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన చార్జిషీట్ అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. చార్జిషీట్ అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories