ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

Minister KTR will Visit Mulugu District today
x

ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

Highlights

KTR: ములుగు సాధన స్కూల్‌ మైదానంలో బహిరంగ సభ

KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో కేటీఆర్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ములుగు సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు.

కాలేజీని ఆనుకొని ఉన్న స్థలంలోనే రూ.65కోట్లతో చేపట్టిన సమీకృత కలెక్టరేట్‌, రూ.కోటి 25లక్షలతో నిర్మించే మోడల్‌ బస్‌స్టేషన్‌, రూ.50లక్షలతో బండారుపల్లి సమీపంలో నిర్మించే సేవాలాల్‌ భవనం, రూ.30లక్షలతో ఏర్పాటు చేయనున్న డిజిటల్‌ లైబ్రరీ, రూ.50లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్‌ హాల్‌లకు శంకుస్థాపన చేస్తారు.

రూ.కోటి వ్యయంతో ములుగు శివారులోని మాధవరావుపల్లిలో నిర్మించిన వైకుంఠథామాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రదేశాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పరిశీలించారు.

అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య, ఎస్పీ గాష్‌ఆలం, ఓఎస్డీ అశోక్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో సమీక్షించారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌ ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో జనసమీకరణపై చర్చించారు.

ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌, ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, ములుగు, వెంకటాపూర్‌ జడ్పీటీసీలు సకినాల భవాని, రుద్రమదేవి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రామప్పలో నిర్వహించే సాగునీటి దినోత్సవంలో కేటీఆర్‌ పాల్గొంటారు. ములుగు నుంచి రోడ్డు మార్గంలో రామప్పకు చేరుకొని రుద్రేశ్వరున్ని దర్శించుకుంటారు. గోదావరి జలాలకు పూజలు చేసి రామప్ప చెరువును రిజర్వాయర్‌గా ప్రకటిస్తారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. ఇక్కడ ఏర్పాట్లను జడ్పీ చైర్మన్‌ జగదీశ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇరిగేషన్‌ సీఈ విజయభాస్కర్‌, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.

ములుగులోని సాధన స్కూల్‌ వద్దగల మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 10వేల మంది లబ్ధిదారులతో పెద్దఎత్తున జరపాలని యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇండ్ల స్థలాలు, 120 మంది లబ్ధిదారులకు రెండో విడత గొర్రెల యూనిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, మహిళలకు వడ్డీలేని రుణాలు, తదితర పథకాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories